పుట:మాటా మన్నన.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిస్థితుల ననుసరించి, సమస్యలను గురించి ఆలోచించాలి. పిన్నలుకూడా పెద్దవారి స్వభావాన్ని గమనించి, వారు వృద్ధులు, వారు అట్లాకంటె మరొకవిధంగా మాట్లాడలేరని భావిస్తే యువజనులుకూడా బాధపడనవసరం లేదు. పెద్దవారు వృద్దాప్యంవల్ల, ఒకొక్కప్పుడు నిగ్రహాన్ని గోల్పోతారు. అసలు పెద్దవారెప్పుడూ తమ పాత అనుభవాలను పదిలపరచుకొంటారు, అవే గొప్పగా పిల్లలతో పదే పదే సంభాషిస్తారు. వద్దన్నా, కద్దన్నా వారు చేసే పనే అది, 'ఇదివరకు మీరు ఈ సంగతి చెప్పారు' అని పిల్లలు వారిని విసిగించకుండా, వారి ధోరణికి వారిని విడిచిపుస్తే, పాపం వారు ఆ విధంగా సంతోషపడతారు!

క్షణ క్షణం మారే ఈ ప్రపంచంలో పెద్దవారు నూతన అభిప్రాయాలకుతట్టుకోలేక దిగ్ర్భాంతి చెందుతారు. వారు ఒకొక్కప్పుడు చాలా బాధపడతారు.

పైన పేర్కొన్న సాధక బాధకాలన్నీ, ప్రేమ, సానుభూతులతో తప్పించుకోవచ్చును. వా రుభయులకు ఇదే మంచిమార్గం. పిన్నలయెడల సానుభూతిగల పెద్దలు, వారి అభిప్రాయాలను, ఆలోచనలను, భంగపర్చచూడరు. అటువంటివారు విని, డయాదాక్షిణ్యాలతో ఉంటారు. అట్లాగే యువజనులు పెద్దలయెడ ప్రేమ గౌరవాలతో ఉన్నట్లయితే పెద్దవారిని బాధించుటకు ప్రయత్నించరు. ఈ విధంగా వీ రిరువురు ఉంటే బాధలేదు.

49