పుట:మాటా మన్నన.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంద రేదో కాలక్షేపం చేయాలని తలుస్తారు. మాటలవల్ల మంచి కలగదని చూస్తారు. వారు పై పై సంగతులు మాట్లాడ తలుస్తారు.

ఏదైనా అసభ్యకరమైన సంగతిగాని అనిష్టకరమైన మాటలుగాని వస్తే “అది వదిలి పెడుదువు, ఏదైనా మంచి మాట చెప్పు” అని మార్చాలి.

వినేవారిని సంతోష పెట్టాలని హాస్యరస కథలు చెప్పటం సంభాషణ కాదు. ఏవైనా కొత్త సంగతులు చెప్పటం సంభాషణ.

అందరికీ ఆమోదకరమైనదానిని గురించి సంభాషించడం మంచిది.

నూతన వ్యక్తులను కలుసుకున్నప్పుడు సంభాషణ సాధారణంగా ప్రశ్నరూపంగానే ఉంటుంది. మీ దేవూరు ? మీ పేరేమిటి? ఈ మాదిరిగా ఉభయులు మాట్లాడు కున్నప్పుడు అనుకూలత కలిగితే ఆ పరిచయం స్నేహంకింద మారుతుంది.

దేన్నిగురించి సంభాషించాలి :

తెలిసిన మనిషి. కనపడగానే కుశలప్రశ్న వేస్తాము. తర్వాత ఏ విషయాన్ని మాట్లాడాలా అని ఆలోచించ వలసి వస్తుంది. అవతల మనిషి, అభిరుచిస్థాయినిబట్టి పలకరించాలి, అతడు గ్రంధ పఠనాభిలాషి. అయితే ఈ మధ్య ఏదైనా మంచి పుస్తకం చదివారా అనవచ్చు.

30