పుట:మాటా మన్నన.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని అతనితో సంభాషించటానికి ప్రయత్నించాలి. ఆ మాదిరిగా అందరిని రంగములో దింపి ఆనందించాలి తెలిసిన వారు,

మంచి సంభాషణకర్త ఎప్పుడూ ఇతరులకు తెలియని విషయాలను మాట్లాడ ప్రయత్నించడు. తన గొప్పదనాన్ని ప్రదర్శించేవారు మంచి సంభాషణకర్త కానే కాడు. అందరూ పాల్గొనటంలోనే సంభాషణ సొగసున్నది. ఎదుటి వారి ప్రశంస పొందకపోతే అరణ్యరోదన.

మానవులు కలసి మెలసి మాట్లాడుకొన్నందువల్ల నే ఒకరి నొకరు అర్థం చేసుకొంటారు. తద్వారా మైత్రి కలుగుతుంది,

సంభాషణలో నిన్ను గురించే నీవు అధికంగా మాట్లాడరాదు. అందుచేతనే , 'ఆత్మస్తుతి, పరనింద పనికిరా' దన్నారు. అసలు అధికంగా మాట్లాడటమే తప్పు. అది అనేక అనర్థాలకు ఆలవాలం.

తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఇందులో ఎక్కువ లాభాలున్నాయి. నీవు మాట్లాడినందున నీకు వచ్చేదిలేదు. విన్నందువలన నీకు అనేక విషయాలు తెలియవచ్చు.

అదీగాక ప్రతివారు మాట్లాడ తలుస్తారు. నీవు ఇతరుల దృష్టిలో మంచివాడవని అనిపించుకోవాలంటే శ్రద్ధగా ఇతరులు చెప్పేది విను.

మంచి సంభాషణకర్త చక్కగా వినేవాడే.

27