పుట:మాటా మన్నన.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంభాషణలో వాగ్వివాదాలు పనికిరావు. అవి చివరకు తగాదాలు క్రిందకు వస్తవి, ఎదటివారి అభిప్రాయాల్ని ఖండించటానికి మనం ప్రయత్నిస్తే, తన అభిప్రాయాల్ని సమర్ధించుకోవటానికి అతడు ప్రయత్నిస్తాడు. అశక్తుడైనపుడు "శేషం కోపేన పూరయేత్ " అన్నట్లు | పవర్తిస్తాడు. 'Debate is the death of conversation' - Emil Luting.

విడువవలసిన దోషాలు:

సంభాషణలో దురుసుదనం పనికిరాదు. మాట్లాడేటప్పుడు ఎదటివారిని "నీవు వట్టి శుంఠవు, నీ కేమీ తెలియదు. నీవు మాట్లాడేదంతా వట్టి చెత్త” అని నీచపరచరాదు. ఇట్లా మాట్లాడేవారంతా సరసులుగారు, ఇతరుల అభిప్రాయాలను మన్నించనివాడు సంస్కారికాడు. అన్నీ అందరికీ తెలియవు. సర్వమూ తెలిసినవారూ లేరు. ఏమీ తెలియనివారూ లేరు అని గుర్తించటం అవసరం.

సోక్రటీసు చాలా గొప్పవాడు. ఆయన అన్నమాట ఆలకించదగినది. “నాకేమీ తెలియదని నాకు తెలుసు, ఇతరులకు ఆ సంగతి తెలియదు” నిండుకుండ తొణక దంటారు ఇదే,

నేర్పుగా మాట్లాడే మనిషి శ్రోత సరిగా వింటున్నాడో లేదో చూస్తుంటాడు. అతనికి శ్రద్ధ లేకపోతే ఆ సంగతి విడిచి పెడతాడు.

సంభాషణ అనేది ఒక ఆటగా భావించాలి. రెండవవాడు ఆడకపోతే ఒక్కడే ఆడే దేమిటి ?

28