పుట:మాటా మన్నన.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నారు. మంచిమాట చెప్పారని ఆ వారపు కృష్ణాపత్రిక సంపాదకీయం ఆశీర్షికతోనే వ్రాశారు.

ఇట్లా సంభాషణలు జరపి ఒకరి అభిప్రాయాలను ఒకరు మన్నించుకొనే పద్ధతిద్వారా ఎందరినో పెంచారు, తాము పెరిగారు కృష్ణారావు గారు,

సజీవ సంభాషణ అంటే అది.

సాధ్యమైనంతవరకు తన అభిప్రాయాన్ని సంగ్రహంగా చెప్పి ఇతరుల అభిప్రాయాలకు అవకాశమివ్వాలి.


సంభాషణలోని కష్టాలు :

భావ వినిమయములో ఆలోచించవలసిన బాధ ఏమిటంటే కొందరు సంభాషణలో పాల్గొనటానికి సందేహిస్తారు. పదిమంది కలిసి మాట్లాడుతున్నపుడు, విందులలోనూ, వినోదాలలోనూ కలసినపుడు మౌనం వహిస్తారు. అతిగా మాట్లాడటం ఎంత అనర్ధదాయకమో ఏమీ మాట్లాడక పోవటమూ అంతే. ప్రతివారూ పాల్గొన్నపుడే దేనికైనా అందచందాలు వచ్చేది. మాట్లాడకుండా మూగవానివలె వున్న వారివంక మిగతావారంతా చూస్తూ ఉంటారు, అతడొకవిధంగా అవమానం పొందినట్లే లెక్క.

కొంతమంది మాట్లాడకుండా ఉండటం శక్తి లేక కాదు, సిగ్గు. సభాపిరికి, ఇంతమాత్రంచేత ఊరుకోరాదు. ఈ బిడియాన్ని పోగొట్టుకొనుటకు ప్రయత్నం చేయాలి, బాగా మాట్లాడేవారు. ఆ బిడియపడేవారిని మాట్లాడేటట్లు చేయటానికి సర్వవిధాల సానుభూతితో ప్రయత్నించటం అవసరం, అతనికి అందుబాటులో ఉండే విషయాన్ని అందు

26