పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

మహాభారతతత్త్వ కథనము


స్తీక పర్వములు ఆదిని ఘటన చేరుకునయబడినవి. గురుసేవామాహాత్మ్యము, గురు మహాత్మ్యము, విద్యోపకారకములైన యజ్ఞాదులు, అనువానిలో నేయొక్కటి లోపించినను విద్యోత్పత్తికానేరదు. కనుక తదర్థమై ఆచా ర్యునిచే ఆఖ్యాయికాముఖమున పౌష్యమునందు గురుశుశ్రూషామా హాత్మ్యము, పౌలోమమునందు భార్గవులైన గురువుల యొక్క మాహా త్మ్యము, ఆస్తీకమునందు జరత్కారువృత్తాంతముచే యజ్ఞాదులకు విద్యాంగత్వము చెప్పబడినది. మహోపనిషదారంభమందు ఈత్రయ ముచెప్పుట ఆవశ్యక మనియు, అర్థము గహన మైనసు ఆఖ్యాయికాము ఖమున జెప్పబడినప్పుడు సుబోధ మగుననియు, తాత్పర్యముతో మహ నీయులయొక్క యశోవీర్యములు ప్రతిపాదింపబడినవి. అని భావము.

“భారత "స్యేతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహః |
    పర్వానుక్రమణీపూర్వం ద్వితీయుః పర్వసంగ్రహః ||
    పౌష్యం పౌలోమ మాస్తీక మాది రంశావతారణమ్ |
    తత స్సంభవపర్వోక్త మద్భుతం రోమహర్షణమ్ ||

టీ|| అత్ర కేవలస్య సోపాఖ్యానన్య చ భారతస్య స్మరణే ఆద్య యోః పర్వణో స్తాత్పర్యం, పౌష్యాదిత్రయస్య తూక్త మేవేతి పర్వ పంచకతాత్పర్య ముక్తం| తత్రాస్తీకే కర్మప్రాధాన్య ముక్తం| తత్క ర్మిణీ దేవభావం ప్రాహ్యాపీహ జన్మ లభన్తే ఇత్యాదా వంశావతరణ ముక్తం షష్ఠే | అంశావతరణం దేవానాం భూమౌ భాగశో౽వతరణ మాదిః ప్రథమం పర్వేత్యర్థః | తేన పూర్వోక్తా సౌతిప్రతిజ్ఞా సంగచ్ఛేేతే||

సంభవే, అత్ర లబ్ధజన్మనా మపి న తేషాం నియమేన స్వర్గతిః కిన్తు సర్పనాగాదితామసయోనిప్రాప్తి రపి కర్మవశాద్భవతీ త్యుక్తం సప్తమే, తత్రా వ్యర్థార్జినో బన్దూ న ప్యన్యాయేన ఘ్నన్తీతి జాతుషే. దర్శిత మష్టమే, తథా కాముకాః స్త్రీయః బన్ధూనపి ఘాతయన్తీతి