పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

65

అవిశ్వసనీయ స్తా ఇతి హీడింబే నవమే దర్శితమ్ | శ్వసూకరభక్ష్య స్యాసి శరీకస్యార్థే పరప్రాణానపి , పామరాః ప్రత్యహ మాదదత ఇతి బకవధే దశమే సూచితం | తతః కష్టతరాం గతిం తమః ప్రధానాః ప్రాణినః ప్రాప్నువన్తీతి ప్రబన్థేన 'పరీక్ష్య లోకాన్ కర్మచిత్రాన్ బ్రా హ్మణో నిర్వేద మాయాన్నాస్త్య కృతః కృతేన' ఇతి శ్రుత్యర్థ ఉప బృంహితః | ఏవ నుగ్రే౽పి తత్తదాఖ్యానతాత్పర్యోన్నయనేన రాజసా నాం సాత్త్వికానాం చ గతిః పరీక్షణీయా, అగ్రేప్రతిప్రకరణం వక్ష్య మాణత్వా దిహ గ్రన్థవిస్తరభయాన్న ప్రపంచ్యతేః|

వెనుక నైదుపర్వములకు తాత్పర్యము వర్ణింపబడినది. అందు ఆస్తీకమునందు- కర్మప్రాధాన్యము చెప్పబడినది. అట్లు కర్మచేసిన వారు దేవభావమును పొందియు, నిచ్చట జన్మింతురని ఆఱవదైన ఆది పర్వముందు అంశావతరణము చెప్పబడినది. (అంశావతరణ మనగా దేవతలు తమతమ యంశములతో భూమియం దవతరించుట. ) శ్లోకములో “ఆది రంశావతరణమ్ ” అనుటచే అంశావతరణపర్వము ప్రథమ మని యర్థము (భారతకథ కన్నమాట) కనుక సౌతి ప్రతిజ్ఞ సంగతమగుచున్నది. (ఇది ప్రథముమనుటచేత నింతవరకున్న గ్రంథము దీని యనుబంధమే కాని యప్రస్తుతముకాదని సూచింపబడినది)

సప్తమమైన సంభవపర్వమందు- ఇచ్చట జన్మించినవారందరికి నియమితముగా స్వర్గతి కలుగ దనియు, కర్మవశమున సర్పాది తామస జన్మములు కలుగు ననియు చెప్పబడినది. అష్టమమైన జాతుష పర్వ మందు- అర్థార్థులు బంధువులను గూడ నన్యాయముచే హింసించు చుందురని చెప్పబడినది. నవమమైన హిడింబపర్వమందు... కాముక స్త్రీలు, బంధువులను గూడ హింసింప జేయుదురు, వారిని విశ్వసించి యుండరాదని చెప్పబడినది. దశమమైన బకవధ పర్వమందు... శునక