పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

మహాభారతతత్త్వ కథనము


పెక్కం డ్రర్థము చేయుచున్నారు. కాని అ ను క్ర మ ణి కాధ్యా యుము 280 శ్లోకములు కలిగి యున్నది.వివిధశ్లోకనిబద్ధమై యున్నది. అనుక్రమణిక లటులనుండవు. అనుక్రమణికాధ్యాయమందు శౌనకాదు లకు, సౌతికి జరిగిన యుత్తరప్రత్యుత్తరములతో 94 శ్లోకములును, శేషించిన 186 శ్లోకములలోను 108 శ్లోకములు ధృతరాష్ట్రపరివేద నము, సంజయు నోదార్పు నను గాధగా పోగా 7 8 శ్లోకము లే మిగిలి యున్నవి” (39 పు.)

ఆయనుక్రమణికాధ్యాయము నీలకంఠీయటీకతో నున్న గ్రంథ మందు 275 శ్లోకములు కలిగియున్నది. అందు సౌతి శౌనకాదుల ప్రశ్నప్రతివచనాదులతో 'ఏకం శతసహస్రం తు మయోక్తం వై నిబోధత ' అనువఱకు 109 శ్లోకము లైనవి ఆపై 'దుర్యోధనో మన్యు మయో మహాద్రుమః' అని యారంభించి చెప్పబడిన సర్వపర్వవృ త్తాంతరూప మగు భారతకథాసంగ్రహము 'అధ్యాత్మం శ్రూయతే యచ్చ పంచభూతగుణాత్మకమ్ | అవ్యక్తాదిపరం యచ్చ స ఏవ పరి గీయతే || యత్త ద్యతివరా ముక్తా ధ్యానయోగబలాన్వితాః | ప్రతి బింబ మివాదర్శే పశ్యం త్యాత్మ న్యవస్థితమ్|| అనువఱకు "చెప్పబడి, ఆపై 'శ్రద్ధధాన స్సదా యుక్తః' అను శ్లోకముతో నారంభించి ఫల శ్రుతి చెప్పబడినది. ఆఫలశ్రుతిశ్లోకములు 15, కథాసంగ్రహమునకు పూర్వశ్లోకములు 109 కలిసి 124 అయినవి ఇక 275 ప్రాప్తికి కలియ వలసిన 151 కథాసంగ్రహమై యున్నది. అవి 'అధ్యర్థ శతమ్' అని చెప్పబడినవి.

ఇచ్చట సోపాఖ్యాన భారతము లక్షగ్రంథము. అందుపాఖ్యాన రహితము 24 వేలు. అని చెప్పి 'తతో౽ధ్యర్థశతం భూయ స్సంక్షేపం కృతవా నృషిః | అనుక్రమణికాధ్యాయం' అని చెప్పుటలో భూయ