పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

55

అసంభవముగా సగపడుచున్నది. దీనిబట్టి మహాభారతకర్తలు ఒకనికంటె నెక్కువయై యుందురని అనుమానింపవలసివచ్చు చున్నది.” (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక ... సంవు 15)

ఇట్టి యూహ పుట్టుట చేతనే అనేకకర్తృత్వమును కల్పించుటకు అసంబద్ధముగా వ్రాసి, అపార్థములు చెప్పి పడరానిపాట్లు పడినారు. ఆ మహర్షి యొక్క అసాధారణశ క్తిని గ్రహింపగలిగినచో వీరి కీకుసృష్టు లుండకపోవును గురుకులవాసముతో నార్షవిద్యాభ్యాసము చేసియున్న యెడల వీరికి ఆమహర్షి యసాధారణశక్తి కొంచము గోచరించి యుండును

“అభక్తానా మనర్హాణాం సచ్ఛాస్త్రం శ్రూయతే౽ పివా |
అన్యథా ప్రతిభాత్యేవ విషాక్తానాం యథా పయః ||”

అన్నట్లు విషసర్పము గ్రహించినక్షీరము విషమగు విధమున అర్హతనుసంపాదించుకొనక, భక్తినిశ్వాసములులేక వర్తించువారికి సచ్ఛాస్త్రము విరుద్ధముగానే గోచరించును. అది గ్రాహకదోషముకాని శాస్త్ర దోషము కాదు. ఇన్ని పాట్లు పడి ముగ్గురు కర్తలని చెప్పి అంత టీతో జాలక యితరులుకూడ మరికొన్ని భాగములు చేసి భారతములో కలిపివేసినా రని చెప్పి, ఆయాగంథ భాగములు విడదీయుటకు వీలుగా నట్లు చేసినారని చెప్పి యేమేమో అల్లికలల్లి అప్రమాణముగా వ్రాత, సాగించిన ప్రతి వాదులు.. గ్రంథమందు చెప్పబడినట్లు యథార్థముగా గ్రహించి ఆమహర్షిశక్తిని విశ్వసించిన శృతార్థులై యుందురుకదా!

ఇక ప్రకృతమునకు వత్తము. మ|| భా||చ|| కారులు 'తతో౽ధ్యర్థ శతం భూయ స్పంక్షేపం కృతవా నృషిః | అనుక్రమణికాధ్యాయం వృత్తాంతం సర్వపర్వణామ్' అను శ్లోకము నందుకొని యిట్లువ్రాసిరి. “అధ్యర్థశతమ్ " అను పదమునకు నూటయేబది శ్లోకము లని