పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

57

శ్శబ్దమును బట్టి 150 శ్లోకములు లక్షకు పై నున్న వని నీలకంఠాచా ర్యులు నిర్ణయించెను అవి యెక్కడ నున్ననో చెప్పుటకే శ్లోకము లోని అనుక్రమణికాధ్యాయశబ్దప్రయోగము.

కనుక 150 శ్లోకములే ఆయధ్యాయమందుండవలెనను నియ మము లేదు ఇట్లు చూచిన 'అనుక్రమణికాధ్యాయం వృత్తాంతం సర్వపర్వణామ్' అనుటను బట్టి సర్వపర్వవృత్తాంకరూపమైన అనుక్రమ ణికాధ్యాయ మదియే అగుటచే నీయధ్యర్థశతశబ్దమునకు పెక్కండ్రు చేసియున్న 150 అను నర్థమే సమంజసమైనది . మ భా. చ. కారులు చెప్పినది సమంజసము కాదు. ఆపై 'అనుక్రమణికాధ్యాయము వివిధ శ్లోకనిబద్ధమై యున్నది. అనుక్రమణికలట్లుండవు' అందురే!

గ్రంథకారుడగు మహర్షి పేరుపెట్టి చెప్పిన అనుక్రమణికా ధ్యాయముపై అనుక్రమణిక లట్లుండ వని వీరి ఆక్షేపమా ? ఇట్లాక్షే పించిన యీ మ. భా. చ. కారులే “పరిశోధించినచో వ్యాసకృతా అనుక్రమణికాధ్యాయము ఆదిపర్వములోని ప్రథమాధ్యాయము కాదని యు, అది సౌతియొక్క మహాభారతమునకు అనుక్రమణికాధ్యాయ మనియు విశద మగును" (పు 39 } అనుటేమి బాగున్నది? అది వ్యాసునిది కాకూడదట! సౌతి మహాభారతమునకు అనుక్రమణికా ధ్యాయము కావచ్చునట! ఆహా! వీరాడిన దాట! పాడినది పాట! సౌతికి మహాభారతకర్తృత్వము సిద్ధింపనేలేదు కనుక వీరి యీ వ్రాత హేయము.

అధ్యర్థశతశబ్దమునకు మీరు చెప్పిన యర్థమును దానికి తగిన యధ్యాయమును చూపుచు చేసిన సమన్వయమును చూడుడు!----

“అధ్యర్థశతశబ్దమునకు ఇదివరకు చెప్పిన గ్రంథమున కథిక ముగా నర్థశతము (50) అను నర్థము పొసగియున్నది. అట్టి