పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

మహాభారతతత్త్వ కథనము


కస్య గ్రన్థస్య దర్శనాత్. తావన్మాత్ర విపక్షాయాంచ లక్ష పూర్తే రయోగాత్ , తథాహి. అత్ర కంఠోక్తాయా స్సంఖ్యాయా స్సంకలనే షణ్ణవతిస్సహస్రాణి ద్వే శతే షోడశచ శ్లోకాః {96216} పరిశేషా త్పుష్కర ప్రాదుర్భావాద్యుపరితనగ్రంథే కైలాసయాత్రాసహితే కించి దూనం సహస్రచతుష్టయం జ్ఞేయం| "తేన “తతో౽థ్యర్థశాతం భూయ స్సంక్షేపం కృతవా నృషిః | అనుక్రమణికాధ్యాయమ్” ఇత్యాదౌ భూయశ్శ బ్దా దద్యర్థశతాధికం లక్షం పరిపూర్ణం జ్ఞేయమ్ ||

అనుక్రమణికాధ్యాయమునందు కంఠోక్తిగా జెప్పబడిన సంఖ్యను సంకలము చేయగా 96216 శ్లోకములు, అందు హరివంశ సంఖ్యగా ఇప్పబడిన 12 వేలు భవిష్యపర్వపర్యంతగ్రంథసంఖ్యయే. యావద్గ్రంథసంఖ్యకాదు. అధిక గ్రంథము కనబడుచున్నది. అందుచే పైనున్న పుష్కరప్రాదుర్భావాదికైలాసయాత్రాంతగ్రంథసంఖ్య కించి న్న్యూనముగా 4 వేలు. ఇట్లు లక్షసంఖ్యాపూర్తియైనది ఆ పై 'అధ్యర్థ శతం భూయ స్సంక్షేపం కృతవా నృషిః' అనుటచే లక్షమీద అధ్యర్థ శతము (150) ఇట్లు మనుష్యలోకప్రతిష్ఠితమైన భారతము యొక్క సంఖ్య సిద్ధించినది అని తాత్పర్యము.

ఇట్లు లక్షకు పైగా నున్నందున 'భారతము సపాదలక్ష గ్రంథము' అనువ్యవహారముకూడ సశేషముగా లక్షగ్రంథ మను తాత్పర్యముతో నుపపన్నమే. ఇంత గ్రంథమునకు వ్యాసమహర్షి యొకడె కర్త యనుట ప్రతివాదులకు కిట్టదు. మహాభారతమీమాంసాకారు లేమనిరో చూడుడు____

“వస్తుస్థితిని బట్టి మహాభారత గ్రంథమందు దగ్గర దగ్గరగా నొక లక్ష శ్లోకము లున్నవని తేలుచున్నది. ఇంతటి పెద్ద

గ్రంథము యొక్క రచన నొక మనుష్యుడే గావించి యుండుట