పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

53


విష్ణుపర్వ శిశోశ్చర్యా విష్ణో కంసవధ స్తథా |
భవిష్యం పర్వచా ప్యుక్తం ఖిలే ష్వేవాద్భుతం మహత్ |
ఏతత్సర్వశతం పూర్ణం వ్యాసే నోక్తం మహాత్మనా ! "

అనుచు హరివంశపర్వ విష్ణుపర్వ భవిష్యపర్వములతో నూరు పర్వములుపూర్ణముగా వ్యాసప్రోక్తము లని చెప్పబడి యుండగా 'దీని యొక్క పర్వసంఖ్య 100 కంటెను వేరైయున్నది." అనుటతప్పు. 'దీనిని సౌతి గ్రంథవిషయము యొక్క పూర్తికై కలిపియున్నాడు. అనుటతప్పు.

భారతేతిహాసమందు సూచింపబడిన కృష్ణ మహాత్మ్యము యొక్కయు, మోక్షధర్మోపయుక్తమగు వైరాగ్యము యొక్కయు, నుపబృంహణర్థమై శౌనకాదుల జిజ్ఞాసావశమున నుపదేశింపబడినహరీ వంశాదిపర్వములు భారతఘటకములే, సారాంశమేమనగా----

వ్యాసకర్తృకమైన భారతము అవాంతరపర్వశతాత్మకమగుట చేతను, హరివంశమును విడిచినపర్వశతపూర్తి కాకుండుట చేతను 'ఏకం శతసహస్రంతు మానుషేషు ప్రతిష్ఠితమ్” అని చెప్పబడిన లక్షగ్రంథ సంఖ్య కూడ హరివంశము కలిసినగాని సిద్ధింపకుండుటచేతను, హరివం శాంతమందు “భవిష్యోత్తర మేతత్తే కథితం భారతం మయా” అని భారతశబ్దముచేతనే ఉపసంహరింపబడుటచేతను, హరివంశము భార తాంతర్గత మనక తప్పదు. ఇట్లు నీలకంఠీయములోనిరూపించి సిద్ధాంతీ కరింపబడియున్నది.

ఇక, హరివంశము చేర్చిన లక్షగ్రంథసంఖ్య యెట్లు సిద్ధించు నందురా? చూడుడు.

నీలకంఠీయమ్... దశశ్లోకసహస్రాణీతి, హరివంశ భవిష్యాన్త
గ్రస్థస్య ద్వాదశసహస్రోన్మితత్వమ్, నతు కృత్స్నహరివంశస్య అధి