పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

మహాభారతతత్త్వ కథనము

ఈ విధముగా అష్టాదశ పర్వవిభాగము, హరివంశము, ఆయాపర్వ ములయందును హరీవంశమందును శ్లోకపరిగణనము వ్యాసమహర్షియే చేసినట్లు కంఠోక్తిగా చెప్పబడియుండ ప్రతివాదులు దానిని తిరస్క రెంచి తమకు దోచినట్లు వ్రాయుట అన్యాయము.

హరివంశము వ్యాసకర్తృకమైన భారతమే అని చెప్పు పై శ్లోకములను బట్టి మ!భా:చ!! కారులు 'వ్యాసుని భారతము సౌప్తిక పర్వాంతము వఱకే యని వ్రాయబోవుచున్నాను' (పు. 32) అని వ్రాసినది పరాస్తమైనది. మ||భా||మీ|| కారులు హరివంశమును గూర్చి యిట్లు వ్రాసిరి--

"హరివంశము ఖిలపర్యమని చెప్పబడుచున్నది. ఖిలశబ్దమునకు తరువాత గలుపబడినదనియుర్థము. దీనియొక్క పర్వసంఖ్య 18 కంను 100 కంటెను వేరై యున్నది. దీనిని సౌతి గ్రంథవిష యముయొక్క పూర్తికై కలిపియున్నాడు. కనుకనే దానికి ఖిలపర్వ మని పేరు పెట్టి 19 వ పర్వమును చేసెను. అందు చిన్న చిన్నవి 3 పర్వము లున్నవి. ఈపర్వములకు కర్త సౌతి కాడని తెలియుచున్నది"

ఈవ్రాతలోని తప్పులు తెలిసికొందము....

నీలకంఠీయములో 'యచ్చ శాఖాన్తరస్థం శాఖాన్తరే ప్రయో జనవశా త్పఠ్యతే తత్ ఖిల మితి వైదికీ ప్రసిద్దిః' అను నిర్వచనమును బట్టి విష్ణుపురాణాదిగతమై భారతేతిహాసమందు ఆకాంక్షావశమున పఠిం పబడిన హరివంశమునకు ఖిల మను పేరు పెట్టబడియుండ 'తరువాత గలుపబడినది ఖిలము' అనివ్రాయుట తప్పు.

అనుక్రమణికాధ్యాయముందు 100 పర్వములను చెప్పుచు...-- “హరివంశ స్తతః ర్వ పురాణం ఖిల సంజ్ఞితమ్ |