పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

51

అని వ్రాసిన మ. భా. మీ. కారులు సౌతియే తనగ్రంథ మందు 'సూతపుత్రేణోక్తాని' అని అన్యులు చెప్పినట్లు చెప్పుట అసం గతము అను ఆక్షేపమునకు ఏమిసమాధాన మిచ్చెదరో? కనుక ఆర్ష శైలి యట్లుండు నని గ్రహింపవలెను'.

పర్వశతమునకు కర్తయైన వ్యాసమహర్షియే ఆయష్టాదశ వర్వ విభాగమునకుకర్తకాని , వినిపించెడిసౌతి కర్తకాడు. ఆసంగతి గ్రంథమే చెప్పుచున్నది. నూరు అవాంతరపర్వములలో ఏయేవర్యములు ఏమహా పర్వములో నంతర్భూతములో ఆ మహాపర్వములోని శ్లోక సంఖ్య యెం అధ్యాయము లెన్ని యో చెప్పిన సందర్భములో వ్యాసమహర్షి యే కీర్తింపబడియుండెను. చూడుడు --

“ఇత్యే తదాదిపర్యోక్తం ప్రథమం బహువిస్తరమ్ |
అధ్యాయానాం శతే ద్వేతు సంఖ్యాతే పరమర్షిణా||
సప్తవింశతి రధ్యాయా వ్యాసే నోత్తమతేజసా |
ఉద్యోగపర్వనిర్దిష్టం సంధివిగ్రహమిశ్రితమ్ ||
వ్యాసే నోదారమతినా పర్వణ్యస్మిం స్తపోధనాః |
సప్తమం భారతే పర్వ మహ దేత దుదాహ్మృతమ్ ||
పారాశర్యేణ మునినా సంచిత్య ద్రోణపర్వణి |
స్వర్గపర్వ తతో జ్ఞేయం దివ్యం య త్త దమానుషమ్ ||
ఏత దష్టాదశం పర్వ ప్రోక్తం వ్యాసేన ధీమతా |
అష్టాదశైవ మేతాని పర్వాణ్వేతా న్యశేషతః ||
ఖిలేషు హరివంశశ్చ భవిష్యం చ ప్రకీర్తితమ్ |
దశశ్లోకసహస్రాణి వింశచ్ల్ఛోకశతాని చ ||
ఖలేషు హరివంశేచ సంఖ్యాతాని మహర్షిణా |
ఏతత్సర్వం సమాఖ్యాతం భారతే పర్వసంగ్రహః || "