పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

మహాభారతతత్త్వ కథనము

దోషము కాదందురా? అటులైన నీలకంఠీయమును చూడుడు___

'వర్ణానుపూర్వీభేదే౽పి ప్రతికల్పమర్థానాం సమాననామరూపకర్మత్వాత్ భారతారంభే మతభేద మాహ-మన్వాదీతి | మనుర్మన్త్రో నారాయణం నమస్కృత్యేతి! ఓం నమో భగవతే వాసుదేవాయేతివా ! తదాదీతి ప్రాఙ్చః దివః పుత్రో వైవస్వతసహ్యసంజ్లో మనుః తదాదీతి తత్త్వమ్.'

శ్రీ దేవబోధకృత మహాభారత తాత్పర్యటీకా . జ్ఞానదీపికా -

“కి మాది భారత మిత్యాహ__మన్వాదీతి. మనుః = ఆదిరాజః ఆస్తీకో = జరత్కారుసుతః ; ఉపరిచరో = వసువిశేషః; తచ్చరిత ప్రస్తావనాది భారత మితి మునీనాం మతభేదః ||

ఈటీకాకారు లాశ్లోకమును ప్రక్షిప్త మనలేదు. ఆయారంభవికల్పముల కౌచిత్యమునే వర్ణించిరి. అదెట్లనగా-

సృష్టితో గూడిన కాలమునకు కల్ప మని పేరు. ఆసృష్టి నశించిన కాలమునకు ప్రళయమని పేరు. సృష్ట్యనంతరము ప్రలయము, ప్రలయానంతరము సృష్టి కలుగుచుండును. ఆయాకల్పములలో సృష్టములగు పదార్థములు వెనుకటి కల్పములలోని పదార్థములతో సమాననామరూపకర్మములు కలిగియే యుండును. ఈ విషయమై వ్యాసమహర్షితో బ్రహ్మ యేమి చెప్పెనో చూడుడు:

పద్మపురాణము - భూమిఖండము - అ21

“హస్త తే కీర్తయిష్యామి సర్వసందేహనాశనమ్ |
దేవస్య లీలాసృష్ట్యర్థం వర్తతే ద్విజసత్తమ|
యథా వారాశ్చ పక్షాశ్చ మాసాశ్చ ఋతవో యథా |
సంవత్సరాశ్చ మనవో యథా౽౽యాన్తి యుగానిచ ||