పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

33

హింపవలసియుండగా నాభారతమందు మీయూహను బట్టి వ్యాసుని జయము మాత్రమే అంతర్బూతమై యుండగా జయమునకును భారతమునకును ఆరంభ భేదములు రెండే చెప్పవలసియుండ మూడవభేదమును చెప్పుట కేమి యుపపత్తిని చెప్పగలరు? దాని నెచ్చట లగింప గలరు?

మఱియు ఈ 'మన్వాది భారతమ్' అనుశ్లోకము "సౌతి రువాచ అని యుపక్రమించి చెప్పబడిన గ్రంథములోని దగుటచే మీదృష్టిని బట్టి చూడగా నిది సౌతికృతమే యని చెప్పవలసియుండును. అప్పుడు సౌతి గురుశిష్యసంప్రదాయముచే తనకు సువ్యక్త మగు గ్రంథారంభమును గూర్చి చెప్పునపుడు మీయూహానుగుణముగా తన మహాభారతములో చేర్చుకొనిన వైశంపాయనభారతమునకు ఇది యాది యనియు, వ్యాసుని జయమునకు ఇది యాదియునియు, తన మహాభారతమునకు ఇది ఆది యనియు స్పష్టముగా చెప్పవలసి యుండ తనకుగూడ సందిగ్ధమే యన్నట్లు 'కేచిత్' ఇత్యాదిశబ్దములతో చెప్పుట యనుచితము కాదా? అన్యగ్రంథములమాట యటుండనిచ్చినను తన గ్రంథమునకు గూడ నారంభ మేదో తనకు తెలియనట్లు సూచించుట యుక్తమా?

ఇక నీతగవు వచ్చునని ము. భా. చ. కారు లన్నట్లు "ఇది వ్యాసాది సంస్కృతకవిత్రయకృతములోనిదై యుండదు” (పు37) అనగా ప్రక్షిప్త మందురా? అట్టి ప్రక్షిప్తమును మీకల్పనకు ప్రమాణముగా మీరెట్లు ప్రదర్శించిరి? మఱియు అది ప్రక్షిప్తమే యనుటకు మీ కాధారమేమి? మీబుద్దికి లొంగలేదని ప్రక్షిప్త మందురేని మిాబుద్దికి లొంగని మహాభారతగ్రంథమున కంతకును ఆగతియే పట్టును.

ఇక మహాభారత మేకకర్తృకమనువారికైనను ఈచిక్కుతప్పనందున ప్రక్షిప్తమనవలసినదే కనుక ఇది మాకు మాత్రమే తటస్థించిన