పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

35

తథా కల్పా స్సమాయాన్తి వ్రజామ్యేవం జనార్దనమ్ |
అహ మేవ మహారాజ్ఞ మయి యాన్తి చరాచరాః ||
పున స్సృజతి యోగాత్మా పూర్వవ దిశ్వమేవహి|
పున శ్చాహం పున ర్వేదాః పునస్తే దేవతా ద్విజాః ||
తథా భూపాశ్చ తే సర్వే ప్రజాశ్చైవ తథా౽ఖిలాః |
ప్రభవన్తి మహాభాగ విద్వాం స్తత్ర న ముహ్యతి ||
రామాదయో మహాప్రాజ్ఞా యయాతినహుషాదయః |
మన్వాదయో మహాత్మానః ప్రభవన్తి లయన్తిచ ||
ఏవం దేవాశ్చ వేదాశ్చ పురాణస్మృతిపూర్వకాః |

అనగా, వారములు, పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, యుగములు, మనువులు, తిరిగి యెట్లు వచ్చుచుండెనో,అట్లే కల్పములు వచ్చుచుండును. బహ్మనైన నేను శ్రీహరిలో జేరి యుందును. చరాచరములు నాలో చేరి యుండును. ఆశ్రీహరి, మఱల సృష్టి కాలము రాగా పూర్వమువలెనే, ప్రపంచమును సృజింపగా మఱల నేను, 'వేదములు, దేవతలు, ద్విజులు, భూపతులు, సకలప్రజలు, ప్రభవించుట జరుగును. మహనీయులైన రామాదులు, యయాతినహుషాదులు, మన్వాదులు, దేవతలు, వేదములు, పురాణములు, స్మృతులు,ఇత్యాదులు ప్రభవించుచుండును. అని భావము.

దీనినిబట్టి ఆయాకల్పములలో వెనుకటి కల్పములలోవలెనే ఆయా పేర్లు కల వ్యక్తులు ఆచర్యలు ఆకథ వానిని చెప్పెడి ఫురాణేతిహాసగ్రంథములు యథాపూర్వముగా నుద్భవించుచుండుటవలన కల్పభేదమును బట్టి భిన్నములగు భారతగ్రంథములయందలి ఆరంభమును గూర్చిన వికల్పములనే “మన్వాది భారతమ్' అనుశ్లోకము వెల్లడించుచున్నది. కనుక విద్వత్సిద్ధాంతములో విమర్శకుల కల్పనలో దటస్థించిన
దోషము లేదు. కల్పభేదమున భిన్నములైన భారతగ్రంథములు పౌరు