పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

17

భారతపంచమాన్ " అనుచు వేదములను కూడ మహాభారతముతో జదివించె నను టెందులకు?

వారిచే జదివించినవాని నన్నిటిని జెప్పుట కందురా? అట్లైన వేదవ్యాసకర్తృకములగు అష్టాదశపురాణములు, బ్రహ్మసూత్రములు,మున్నగువానిని గూడ జదివించియే యుండును గనుక వానిని బేర్కొనకుండుట న్యూనత కాదా? కనుక వేదములతో మహాభారతమును చదివించె ననుటకును,వారిచే భారతముయొక్క సంహితలు ప్రకాశింపజేయబడిన వనుటకును సంబంధము(హేతుహేతుమద్భావము) వర్ణింపవలసియున్నది. అది యుశక్య మందురేమో! ఈ నీలకంఠీయటీకను చూడుడు!!

“భారతస్య మూలభూతా స్సంహితాః మంత్ర బ్రాహ్మణరూపా వేదా: | తై స్సుమంతుప్రభృతిభి: ప్రకాశితా ఇద మస్య మూల మిద మన్య మూల మితి స్పష్టీకృతాస్తేన ప్రత్యక్షవేదమూల మేత దితి భావః |"

అనగా - "సంహితా స్తైః : పృథక్త్వేన భారతస్య ప్రకాశితాః" అనునపుడు సంహిత లనగా మంత్ర బాహ్మణరూపములగు వేదములే. భారత మనగా వారు చదువుకొనిన మహాభారతమే. ఇప్పుడు సమ స్వయింపగా భారతమునకు మూలభూతము లైన మంత్ర బాహ్మణరూపవేదములు సుమంత్వాదులచే వేఱువేఱుగా భారతములోని యీ భాగమునకు ఈవేదభాగము మూలము” అని ప్రకాశింప (స్పష్టీకరింప) బడినవి. అని నిర్దుష్టార్థము. ఇట్లు చెప్పినపుడు 'భారతస్య సంహితాః' అను షష్ఠీవిభక్తి యుపపన్న మైనది. ఆ సుమంత్వాదులు వేదములతో మహాభారతమును చదువుకొనినందులకు ఫలము తా మా మహాభారతమున కర్థము చెప్పునపుడు ఆయా భాగముల కాయావేదభాగ