పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

మహాభారతతత్త్వ కథనము

మఱియు వారు మహర్షి యొద్ద జదువుకొనినది మహాభారతము. . ఇక. 'భారతస్య సంహితాః స్తైః ప్రకాశితాః ' అనునపుడు మీయూహను బట్టి వారిచే రచింపబడినది 'భారతస్య సంహితా' అను భేదనిర్దేశముచే భారతము యొక్క సంహితలుకదా, ఇచ్చట భారత మనగా వేదవ్యాసునియొద్ద వారు చదువుకొనిన మహాభారతమా? లేక మీరన్నట్లు వారిచే రచింపబడిన భారత మను గ్రంథాంతరమా? మహాభారతమే యైన యెడల మహాభారతము యొక్క సంహితలను చేసిరను మాటకు అర్థమేమి? సంహితాశబ్దమునకు మూలగ్రంథమని యర్థమా? వ్యాఖ్యానగ్రంథమని యర్థమా? మూలగ్రంథమనినచో వేదవ్యాసుని మహాభారతము జదువుకొని వేదవ్యాసశిష్యులు వేదవ్యాసమహాభారతమునకు మూలగ్రంథము వ్రాసినారనుట హాస్యాస్పదము. ఇక వ్యాఖ్యాన గ్రంథమనినచో మహాభారతవ్యాఖ్యాతలు కావలసిన వైశంపాయనాదులకు వ్యాఖ్యానరూపముకాని భారతగ్రంథముసకు కర్తృత్వము పొసగదు.

ఇక నిచ్చట భారత మనగా వారు చదివిన మహాభారతము కాక వారు రచించిన గ్రంథాంతరమగు భారతమే యందురా?

అటైన వారు భారతములను వ్రాసిరా? భారతముయొక్క సంహితలను వ్రాసిరా? భారతములనినను భారతము యొక్క సంహితలనినను ఒకటే యందురా ? అట్లైన 'భారతస్య సంహితా' అనునపుడు షష్ఠ్యర్థమును భ్రంశపఱచినారన్నమాటే.

మఱియు మీయభీష్టానుసారము 'వేదవ్యాసమహర్షి మహాభారతము సుమంత్వాదులకు జెప్పెను. వారిచే భారతసంహితలు చేయబడినవి' అని యింతమాత్రమే చెప్పక ' వేదా నధ్యాపయామాన మహా