పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

మహాభారతతత్త్వ కథనము

ములు మూలము లని యుదాహరించి చెప్పగల్గుటే యని సిద్ధించినది. వారు చదువుకొనిన వేదవ్యాసమహాభారతమునకు వేదభాగోదాహరణములతో వివరించి యర్థము చెప్పినవారేకాని తలకొక భారతము వాసినవారు గారని కూడ తేలినది

కనుకనే "భారతం పంచమో వేదః, సర్వశ్రుతిసమూహోయమ్" అని వేద వ్యాసమహర్షి యీమహాభారతము వేదమూలకమని యుపదేశించెను. ఇట్లు పరిశీలింపగా ప్రతివాదులు చూపియున్న 'వేదా నధ్యాపయామాస మహాభారతపంచమాన్" ఇత్యాది శ్లోకములు సుమంత్వాదులు భారతములు వ్రాయలేదనియే చెప్పుచుండ వ్రా సినారనియే చెప్పుచున్నవను ప్రతివాదుల వ్రాత హేయము. గీతారహస్యము (పు 719) లో సుమంతుడు జైమిని పైలుడు శుకుడు వైశంపాయనుడు అను నీ యైదుగురును నేర్వేరుగ నైదు భారతసంహితలను లేక మహా భారతములను వ్రాసిరని స్పష్టముగ జెప్పబడినది' (అ. 63-90) అను వ్రాతకూడ పరాస్తము.

ప్రతివాదులు కల్పించిన విభాగమును బట్టి చూడ జయ మను గ్రంథాంతరమును వ్రాసిన వ్యాసమహర్షి సుమంత్వాదులకు తనగ్రంథమును పాఠము జెప్పుటకాక యెక్కడో సౌతి వ్రాసిన మహాభారతమును పాఠము చెప్పె ననుట ప్రతివాదుల కెంత యుక్తముగా నున్నదో పాఠకు లూహింతురు గాక.

ఇక 'భారతము మహాభారతము' అని రెండుగ్రంథములు భిన్నముగా నుండినట్లు ఆశ్వలాయనగృహ్యసూత్ర ము బోధించుచున్నదను ప్రతివాదుల వ్రాతను పరిశీలింతము.

(2 ) “సుమన్తుజైమిని వైశంపాయనపైలసూత్రభాష్యభారతమహాభారతధర్మాచర్యాః”