పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ఉపోద్ఘాతము

ఈ యుద్గ్రంథము పఠన శ్రవణప్రక్రియలచే పాపహరమై, ఐహికాముష్మిక శ్రేయస్సాధనమై, భారతీయభాగ ధేయమై భాసించు చున్నదనుట జగద్విదితము.

కాని యార్షవిద్యాసంప్రదాయము దూరమై యున్న యీకాలమందు ఆర్ష గ్రంథ తాత్పర్యము దుర్జ్ఞేయమగుటచే స్వబుద్ధి ప్రాభవమున బరిశీలుంచు వారికి విరుద్ధముగా నుండినట్లు కనబడుటనుబట్టి యీమహాభారత మందు ఇటీవల పాశ్చాత్య విజ్ఞాన సంపన్నులును, తదనుయాయులును అగు కొందరు హస్తనిక్షేషము చేసి సంప్రదాయ విరుద్దముగా బహిరంగ పరీక్ష యను పేరుతో నేమేమో వాసి విమర్శనము లనబడు కొన్ని గ్రంథములను లేవదీసిరి.

అందు సప్రే పండితునిచే హిందీలో వ్రాయబడి, చర్ల నారాయణశాస్త్రిగారి చే నాంధ్రీకరింపబడిన మహాభారత మీమాంస, బంకిం చంద్ర చటోపాధ్యాయునిచే వంగ భాషలో వ్రాయబడి, బాలాంత్రపు సూర్యనారాయణరావు గారిచే నాంధ్రీకరింపబడిన శ్రీకృష్ణ చరితము, కోటమర్తి చినరఘుపతిరావు గారి సుయోధనవిజయము, పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రిగారి మహాభారతచరిత్రము ఇత్యాదులు కలవు.

ఈ విమర్శనము లుద్బవించి యా మహాభారతమందు నిరూఢమగు లోకవిశ్వాసమును సడలింప మొద లిడినవి. అట్లావిశ్వాసము సడలుటచే గ్రంథకర్త యగు మహర్షికి గూడ నజ్ఞత నాపాదించుటకు లోకము సిద్ధపడుచున్నది.

ఆహా! మన మేమాత్రమైనను లోకోత్తర మగు విజ్ఞానము నార్జింపగలిగితి మేని యది యార్షగ్రంథ మూలకమే యని ముమ్మాటికి చెప్పక తప్పదు.