పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
3
ఉపోద్ఘాతము

అట్టి యసాధారణము లగు గ్రంధరత్నములను లోకానుగ్రహ బుద్దితో మన కొసగిన మహర్షి ప్రవరులయెడ మనము యావజ్జీవము జూపవలసియున్న కృతజ్ఞతకు బదులు కృతఘ్నత నాశ్రయించి వారల దూషించుటకు గూడ సిద్దపడుటకంటె పాప కార్య మేమున్నది? కనుక నార్షవిద్యాసంప్రదాయ ప్రవర్తకులలో నాచార్య పీఠము నధి ష్ఠించి, యార్షవిద్యోపజీవులు కహరహస్స్మరణీయుడై యున్న వేదవ్యాస మునీంద్రుని మహాభారత మందు నవ్వుల విమర్శనములచే ప్రదర్శింపబడిన సంప్రదాయ విరుద్దాంశములకు యథామతి గొన్ని సమాధానములు చూసీ యా ఋషిఋణము నేమాత్రము నైన తీర్చుకొనవలె ననుతలంపుతో నీ మహాభారతతత్త్వకథనము' అను గ్రంథము వ్రాయబూనితిని. పై జూపబడిన విమర్శన గ్రంథములలో కడపటి దగు మహాభారతచరిత్ర ముపై ఖండనములు -

1. 'పండిత ప్రవర' మల్లాది రామకృష్ణ విద్వచ్చయనుల వారి 'మహాభారత కథాతత్త్వనిర్ణయము', 2. మహామహోపాధ్యాయ, కవిసార్వభౌమ శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రిగారి 'మహాభారత చరిత్రనిరాకరణము' 3. శిష్ట్లా సూర్యనారాయణ శాస్త్రిగారి 'మహాభారతరహస్యము' మున్నగునవి బయలువెడలినవి. ఈ మూడవ మహాభారత రహస్యమందు గూడ విరుద్దాంశము లుండుటచే కవిసార్వభౌములచేతనే ‘మహాభారత రహస్య విమర్శనము' అను గ్రంథము కూడ వ్రాయబడినది. ఐనను సంప్రదాయ సిద్దార్థమునకు ప్రమాణసమ్మతిని; ప్రతివాదమునకు ప్రమాణవిరోధమును ప్రతిపాదించు పద్దతిని వ్రాయబడెడి యీగ్రంథము విశేషాంశములను బోధింపగలుగుటచే పాఠకలోకమున కావశ్యకమే యని తోచకపోదని నా నమ్మకము.

వైదికమార్గప్రకాశక మగు మహాభారతమును గూర్చి అక్రమప్రసంగములు జరుగుచుండ శక్తి కొలది నివారింపబూని యీ గ్రం