పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

81


ప్రాణపదం బైన భామ యొక్కతె వచ్చి
        గజనిమ్మపండ్లుఁ జే కాన్క యొసఁగి
యేకాంతమునఁ బల్క నితనితో నొకమాటఁ
        జాల సంతస మంది సకియ కపుడు


తే.

నమ్మిక లొసంగినాఁడట నెమ్మిమీర
నేమి కార్యంబొ! తెలియము స్వామి యిప్పు
డిట్టి దొడ్డ రహస్యంబు నేమి? యనుచుఁ
దెలియ నడుగుఁడు మీ రింకఁ దేటగాను.

28


క.

అని పలుకు చెలులమాటలు
విని నవ్వుచు మనసులోన వేడుక మీరన్
దన శ్రీహస్తముచేతను
దనయుని నెమ్మేను నిమిరి తగ నిట్లనియెన్.

29


సీ.

ధర నుతింపఁగఁ దగు ధైర్యగుణంబున
        మేరువు గెల్చిన మేటి వీవు
ఘనులు మెచ్చఁగ నగు గాంభీర్యమహిమను
        రత్నాకరుని గెల్చు రాజ వీవు
బుధులు రాఘవుఁ డన భుజపరాక్రమమున
        జామదగ్న్యుని గెల్చు జాణ వీవు
పొగడంగఁ దర మైన బుద్ధిచాతురిచేత
        ఫణిపతి గెల్చిన ప్రౌఢ వీవె


తే.

ఇట్టి గుణములచే మది నెంచిచూడ
నీకు నెన యైన వార లీలోకమునను
నృపతు లెవ్వరు? [1]రఘునాథనృపకుమార!
యువతిమకరాంక విజయరాఘవశశాంక!

30


క.

తెలిసితిమి నీదు కోరికఁ
గలఁకలు వల దింక మేలు గలుగు న్నీకున్
[2]గలికిని వలచిన హేతువుఁ
దెలిపెద వినవయ్య! తేటతెల్లమి గాఁగన్.

31
  1. రఘునాథనృపకొమార. క. రఘునాథనృపకుమార
  2. కలికికి. క. కలికికి.