పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

మన్నారుదాసవిలాసము

నాగబంధము


చ.

జలజముఖీ! వయోలలితశాతనఖస్తనభారభాసురా!
యలరులబంతి! బాల! ఘనయానజయస్తవ! యిందురేఖని
ర్మలతరకాంతిశీల! విను మాను మసన్మతిఁ గాముఁ డేయఁగా
వలవదు మాన మేల? దయ బాయక సుస్థితి నేలవే సఖీ!

18


వ.

అని విజయరాఘవమహీకాంతుండు కాంతిమతిమీఁది మోహపారవశ్యం
బునఁ బలుకు సమయంబున.

19