పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

67


నూఁగారు ధూమలతాగౌరవముఁ దాల్చు
        నసివిలాసం బందె యమరియుండు
నెమ్మోము హరిణాంకనిభమై చెలంగును
        నీరజద్యుతి యందె నిండియుండు


తే.

లలన మదనుని యింద్రజాలంపువిద్య
కాకయుండిన నిటువలె లోకమునకు
నచ్చెరువుఁ బూన్పఁజాలునే మెచ్చు లొదవ
లెవ్వరు సాటి మాకాంతిమతికి?

61


క.

కులమున గుణమున రూపున
నిల నలకాంతిమతివంటి యింతులు గలరే!
చెలువకు నీవే తగుదువు
తలఁపఁగ నాయింతి నీకె తగును నరేంద్రా!

62


చ.

ఎలమిని నీవు కాంతిమతి నిప్పుడు మెచ్చుగఁ బెండ్లియాడినన్
నెలయును రోహిణీసతియు నీరజనాభుఁడు సింధుకన్యయున్
వలపులవింటిజోదు రతి వన్నెగఁ గూడినలీల నుందు రౌ
వల నగునట్టి కుందనము వాసనఁ జెందినరీతి నెంచఁగన్.

63


క.

అని యవ్విలాసవతి బ
ల్కిన వీనుల విందుగా సఖీమణిగుణముల్
విని మనమున నుప్పొంగుచు
నెనయఁగ మన్నారుదాసుఁ డిట్లని పలికెన్.

64


సీ.

రాజీవలోచన! రాజగోపాలు నే
        సేవింపుచును వచ్చి చెలువుమీర
మేలైన బంగారుమేడపైఁ దొలుకరి
        మెఱుఁగుకైవడి నుండు మెలఁత నపుడు
కన్నులపండువుగా విలోకింపుచు
        నీకాంతి గలదె! యేయింతికైన
నేరాజకన్యయో! యీరాజముఖి యంచుఁ
        [1]జోద్య మందితి మది సొక్కి మిగుల

  1. సొద్య మందితి, క. సోద్య మందితి.