పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

మన్నారుదాసవిలాసము


సీ.

అనుపమగతి మించు తనుకాంతిచే నల
        హేమసౌందర్యంబు నెసఁగ మించు
జోకైన తొడల మేల్ చాకచక్యంబుచే
        రంభావికాసంబు రహి జయించు
నిడువాలు కనుఁగవఁ బొడమెడు [1]సిగ్గుచే
        హరిణివిలాసంబు నతిశయించు
నుతియింపఁ దగిన నెన్నుదుటి యొప్పిదమున
        శశిరేఖలీలల సరవి మీరు


తే.

[2]నెనరు నాస దిలోత్తమవినుతి నలరుఁ
గైశికమున సుకేశివిఖ్యాతిఁ దనరు
నరయ నచ్చెరపూఁబోణులందు నైనఁ
గాంతిమతిసాటి బోల్ప నేయింతి గలదు?

59


సీ.

అలరఁ బ్రత్యక్షపాంచాలాదిశయ్యల
        సకలప్రబంధముల్ చదువ నేర్చు
జంత్రగాత్రంబులు జతగూడ శ్రుతులకు
        నింపుగా వీణె వాయింప నేర్చుఁ
బదపద్యగద్యముల్ బహువిధోల్లేఖల
        హరువుగా రచన సేయంగ నేర్చుఁ
గడు వింతలుగ నాటకంబులు హవణించి
        మించి కేళిక వినుపించ నేర్చు


తే.

వ్రాలు ముక్తాఫలము లన వ్రాయనేర్చుఁ
దనరఁ జిత్తరువులు వ్రాయఁ దానె నేర్చు
విజయరాఘవ! మాటలు వేయు నేల?
చెలఁగి నిన్ను మెప్పించ మా చెలియ నేర్చు.

60


సీ.

పదములు సరిలేని పద్మరేఖలఁ బొల్చు
        హంససంగతు లందె యలరియుండు
నందంబుఁ బెందొడ లనఁటులై యుండును
        గరికరశ్రీ లందె కలిగియుండు

  1. క. నిగ్గుచే
  2. నొనరు. క. నెనరు