పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

63


నుండ నాకర్ణింపుచు, ద్వాదశోర్ధ్వపుండ్రంబులు ధరియించి యయ్యాచార్య
వర్యుండు ప్రశస్తం బగు తమ శ్రీహస్తంబునఁ బ్రసాదించు మన్నారుదాస
నామముద్ర భద్రంబుగా వక్షస్థలంబున ధరియింపుచు, యత్నంబుమీరఁ
గాలించిన రత్నమయం బగు జపసరంబుఁ జేఁ బూని, యష్టాక్షరీమంత్ర
జపంబు నల రాజగోపాలమంత్రజపంబు గావించి, నిత్యదానంబు లొనర్చి
తిరుశఠగోపంబులకుఁ దిరువారాధనంబు సేసి, తదనంతరంబున ముదంబున
మన్ననారుసన్నిధి నిలిచి సంతసంబున నింతు లొసంగు చెంగల్వసరంబులను
[1]సేమంతియలను, నింపులు నింపు చంపకకుసుమంబులను జాజుల, గేదంగులఁ
[2]గెందమ్ములను, జెలువుమీరు శ్రీతులసీదళంబులను, సహస్రనామంబుల
నర్చనంబు గావించి, ధూపదీపనైవేద్యతాంబూలసమర్పణంబు సేయించి,
యారాజవదనలుం దానును నీరాజనంబు లొసంగి, ధ్వజవ్యజనాతపత్ర
చామరదర్పణధారణప్రముఖంబు లగు సకలోపచారంబులు గావించి, వచన
కుసుమార్చనలుగాఁ దాము విన్నవించిన విన్నపంబులు వినిపింపుచు సన్ను
తించి, సన్నిధివా రొసంగు తీర్థప్రసాదంబులఁ గైకొని, యయ్యింతులుం
దాను [3]నారాజగోపాలున కభిముఖుండై వచ్చి, యచ్చట మెచ్చుగా
యత్నంబునం బఱచిన రత్నకంబళంబులయందు నొద్దిక యగు రతనంపు
గద్దియమీఁద నిండువేడుకతోడం గూర్చండి, చెలువుమీరఁ గొలువు [4]సింగా
రంబై, యయ్యాచార్యవర్యు లగ్రభాగంబున కలంకారంబుగా వేంచేసి
యుండ, శ్రీవైష్ణవశ్రేణులు నలువంకలన్ బలసి కూర్చుండి యాశీర్వా
దంబులు సేయుచు నుండ, శ్రీమద్రామాయణశ్రవణంబు గావించి,
విద్వత్కవిబృందంబు లందంద నింపొందఁ బ్రసంగంబులు సేయ వినుచు,
శ్రీరాజగోపాలశౌరి కారగింపుఁ గావించి తెచ్చియిచ్చు తాంబూలంబుఁ
గావింపుచు, నిండువేడుకతోడఁ బేరోలగంబుండి, యంతట సమ్మదంబున
నమ్మగువలుం దానును మన్ననారుల మగుడ సేవించి ముదంబునం
గదలివచ్చె; నాసమయంబున నవ్విలాసవతియును నతిమోదంబున.

49


క.

సంగీతము వినిపించఁగ
నంగన లిరుగడల నిల్చి హరు వలరంగా
బంగరుపల్లకియందును
రంగలరుచు వచ్చు విజయరాఘవుఁ జూచెన్.

50


వ.

చూచి యయ్యవసరంబున.

  1. శామంతెలను. క. శామంతెలను
  2. కెదమ్ములను
  3. నాగోపాలున. క. నారాజగోపాలున
  4. శింగారంబై క. శింగారంబై