పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

మన్నారుదాసవిలాసము


సీ.

ఇది వేళ తన కని యిచ్చ నుప్పొంగుచుఁ
        జేరంగఁ జనుఁదెంచి చెన్నుమీర
నంజలి సేయుచు నల కాంతిమతిగుబ్బ
        పాలిండ్లకును నిది ప్రతి యటన్న
కైవడిఁ జేనున్న గజనిమ్మపండ్లను
        గాన్కగా నొసఁగు నాకలికిఁ జూచి
యంగనామణి వచ్చు నింగితం బెఱుఁగుచుఁ
        బిలుపింతు నిదె యని ప్రేమఁ బల్కి


తే.

యపుడు నగరు బ్రవేశించి యతిశయించు
రాజసంబున నంతఃపురంబుఁ జేరి
యారగించినపిదప నయ్యతివఁ దలచి
సంతసంబున నుండి సమ్మదము మెఱయ.

52


క.

సరసకు నెగ్గడికత్తెను
మెఱవడితోఁ బిల్చి యపుడు మిక్కిలి తమి నా
తరుణిం దోడుక రమ్మన
సరగున నది తోఁడితెచ్చె సముఖంబునకున్.

53


వ.

అంత.

54


క.

రంజిల్లి మ్రొక్కి నిల్చిన
కంజానన! వచ్చినట్టికార్యం బేమీ?
మంజులవాణీ! యన నా
[1]తంజపురాధిపున కింతి తా నిట్లనియెన్.

55


సీ.

శ్రీరాజగోపాలశౌరి చెంగమ్మయు
        గరుడవాహన మెక్కి కదలిరాఁగ
రాజచంద్రునిపుత్రి రాజబింబానన
        యల కాంతిమతి జూచి యపుడు మిమ్ము
నారాత్రిఁ గలలోన నక్కఱ మీరంగఁ
        గలసినయట్లుండఁ గలఁగి మిగుల
విరహంబుచే సొక్కి మరునికాఁకకు స్రుక్కి
        మనసు నీపై నుంచి మమత హెచ్చఁ

  1. తంజాపురా, క. తంజపురా