పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

మన్నారుదాసవిలాసము


గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమానసారసార
స్వతధురీణయు, విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగాహనప్రవీణయు,
తత్ప్రతిపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు, శృంగారరసతరంగితపద
కవిత్వమహనీయమతిస్పూర్తియు, అతులితాష్టభాషాకవితాసర్వంకషమ
నీషావిశేషశారదయు, రాజనీతివిద్యావిశారదయు, విజయరాఘవమహీ
పాలనిత్యసంభావితయు, విద్వత్కవిస్తుతగుణసేవితయు, పసపులేటివెంక
టాద్రి బహుజన్మతపఃఫలంబును, మంగమాంబాగర్భశుక్తిముక్తాఫలంబును,
రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మవచనరచనాచమత్కృతిం జెన్నుమీరు
మన్నారుదాసవిలాసం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.



[1]శ్రీరాజగోపాలాయ నమః


  1. క. శ్రీ రాజగోపాలాయ నమః, శ్రీతాతగురవే నమః