పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

మన్నారుదాసవిలాసము


కురువేరుఁ దమ్మివిరులును
సురవొన్నలు సవదరించి సొంపు దలిర్పన్.

97


క.

కుందనపు బళ్ళెరంబుల
గందము కుంకుమము పచ్చికస్తురి మది కిం
పొందు ఫలంబులు నింపుచు
ముందఱ నెరయించి చేరి మ్రొక్కుచు నంతన్.

98


క.

కాంతిమతిచేత నెంతయు
సంతసమున బహువిధోపచారము లమరన్
వింతగ వెలయించిరి రతి
కాంతునకు సపరివారకమ్ముగఁ బూజల్.

99


వ.

అప్పుడు.

100


తే.

విజయరాఘవమేదినీవిభుని నన్ను
మకరకేతన! జతగూర్చి మనుపు మనుచుఁ
గాంతిమతి మ్రొక్కె హస్తపంకజయుగంబు
మోడ్చి నుదుటను గదియించి ముదము వొదల.

101


సూర్యాస్తమయచంద్రోదయవర్ణన

వ.

తదనంతరంబ.

102


క.

ధారుణిఁ దాపము దీఱెన్
గోరి విహంగంబు లెల్ల గూండ్లకుఁ బారెన్
వారిజముల వగ మీరెన్
సారసబాంధవుఁడు నపరశైలముఁ జేరెన్.

103


చ.

వికచసరోరుహేక్షణకు వేమరు నేగతిఁ బ్రొద్దు [1]వచ్చినన్
బ్రకటముగాఁగ నెమ్మదిని బైపయిఁ దాపమె చాల హెచ్చెగా
యకట! యికేమి సేయుదుము హా యనుచుం గడు చిన్నఁబోవు నా
సకులముఖాంబుజంబు లన సారసముల్ ముకుళించె నత్తఱిన్.

104
  1. క. పుచ్చినన్.