పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

47


నవరత్నమయభూషణముల శృంగారముల్
        వింతగాఁ గనుపట్ట వేడ్కఁ బూని


తే.

అపుడు పులుకడిగిన ముత్తియము లనంగ
చికిలి సేసిన మరుని సాయకము లనఁగ
మెఱసి తొలఁగని [1]తొలకరి మెఱుఁగు లనఁగఁ
జూడఁ గనుపట్టి రెంతయు సొగసుమీర.

93


మన్మథారాధనము

వ.

తదనంతరంబ.

94


సీ.

సంతసంబున నింక కంతునిఁ బూజించి
        యింతి మైకాఁక వారింత మనుచు
నంగనామణు లెల్లఁ జెంగల్వడిగ్గియ
        చెంగట నెంతయు రంగుమీరు
సురవొన్నక్రిందట హరువులు గనుపించఁ
        బరపైన విరులచప్పర మొనర్చి
పన్నీటఁ బదనిచ్చి మిన్నగాఁ గనుపట్టఁ
        దిన్నఁగా గందంపుదిన్నె వైచి


తే.

చాతురి జెలంగఁ గస్తురిచేత నలికి
నిగ్గు దేరంగఁ గపురంపుమ్రుగ్గు వెట్టి
తమ్మివిరిరేకుపటమునఁ గమ్మవలపు
గోవజవ్వాదిచే నిజభావ మలర.

95


మ.

రతిదేవి న్మకరాంకునిన్ సుమధనుర్బాణంబులన్ మందమా
రుతమున్ శీతకరున్ వసంతు శుకమున్ రోలంబకాదంబసం
తతులన్ గోకిలశారికాప్రతతులన్ దత్తద్విలాసంబులన్
జతగూడన్ లిఖియించి నిల్పి యచటన్ జాతుర్య మొప్పారఁగన్.

96


క.

విరవాదులు సంపెంగలు
మరువము దవనంబు బొండుమల్లెలుఁ గలువల్

  1. తొలుకరి