పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

మన్నారుదాసవిలాసము


గొమ్మ! నా వెనువెంట రమ్ము లేదిట యీఁత
        నమ్ము ముమ్మాటికి నెమ్మి ననుచు


తే.

నగుమొగము సోయగమ్ముల జిగి జెలఁగ
బిగి మెఱుఁగు చన్నుఁగవ నిగనిగలు నిగుడఁ
దెగలుతెగలుగ జలముల నెగరఁజల్లు
చిగురుఁబోణులు విహరించి రగణితముగ.

87


వ.

మఱియును.

88


క.

చిమ్మనగ్రోవుల జలములుఁ
జిమ్ముచు నొండొరులమీఁదఁ జెలులను జేరన్
రమ్మని యండెల వ్రేయుచు
నెమ్మిన్ విహరించి రపుడు నీరజనయనల్.

89


వ.

తదనంతరంబ.

90


ఉ.

[1]జాఱుడుపీఁట లెక్కి డిగజాఱెడువారును జల్లులాడుచుం
బోరి మునింగి దూరముగఁ బోయి రయంబున లేచువారలున్
సారసచక్రవాకబకసంఘములన్ వడిఁ జోపువారు నై
వారిజలోచనామణులు వారివిహారము [2]సల్పి రందఱున్.

91


క.

ఎంతయు వేడుక నీక్రియ
నింతులు జలకేళి సల్పి యిచ్ఛాగతులన్
గాంతిమతిఁ దోడుకొని తా
రంతటఁ దీరంబుఁ జేరి యనుపమలీలన్.

92


సీ.

మేలైనబంగారుపూలపావడలపై
        జిలుగుచెంగావిచీరలు ధరించి
కురులు నున్నగ దువ్వి కొప్పు లొప్పుగఁ బెట్టి
        పొలుపు మీరఁగ ముడిఁ బూలు దుఱిమి
తీరుగాఁ గస్తూరితిలకంబులను దీర్చి
        కలపముల్ నెమ్మేనఁ గలయ నలఁది

  1. జారుగు. క. జారుగు
  2. క. సల్పి రందఱన్