పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

మన్నారుదాసవిలాసము


క.

రయముల మారుతమానస
జయముల మును గనిన వగుట స్వామికి వనిలో
[1]జయముల నొసఁగఁగఁజాలెడు
హయము లనేకములు జెలఁగు నప్పురిలోనన్.

99


క.

బాహుబలయుతులు నిజస
న్నాహంబులఁ జెలఁగు సింహనాదంబులచే
నాహవముల వైరిగజ
వ్యూహముల నడంచి వీట నొప్పుదురు భటుల్.

100


సీ.

గజతురంగమధేనుకల్పనగంబులు
        విద్రుమముక్తాదివీథిశతము
సహ్యజ మొదలైన సకలమహానదుల్
        మానితద్విజరాజమండలంబు
దీవులకై వచ్చి తిరిగిపోవుచు నుండు
        వణిజు లాదిగ గల్గు వర్తకులును
అచ్చరలే వీర లనఁదగు నతులిత
        సౌందర్యనిధు లైన జలజముఖులు


తే.

దినదినంబును నభివృద్ధి గను విధంబు
నమితబుధతృప్తిఁ గలిగించు నమృతమహిమఁ
జెంగమలవల్లి మన్నారు చెలఁగుచున్కి
పాలసంద్రంబె యౌర యప్పట్టణంబు.

101


విజయరాఘవుఁడు రాజగోపాలస్వామికి ఫాల్గుణోత్సవముఁ జేయ సంకల్పించుట

వ.

అప్పురంబున కధీశ్వరుండు.

102


సీ.

తన చక్కదనము కందర్పచంద్రులకును
        దేహాభిమానవృత్తిని హరింపఁ
దన దానమహిమ సంతానాభ్రములకును
        బాటి దప్పిన వెల్లఁబా టొనర్ప

  1. జయము లొసంగఁగ జాలెడు