పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


తన యశోగరిమంబు దశదిశాంగనలకుఁ
        గొమ రైన వెలిబట్టుకోక లొసఁగఁ
దన ప్రతాపభరంబు దర్పితాహితులను
        నగపంక్తులకు దవానలము గాఁగ


తే.

శేషకూర్మవరాహేభశిఖరివరులు
గోపురము మోచు ప్రతిమల రూపుఁ దాల్ప
నిజభుజదండమున ధాత్రి [1]నిల్పుచుండు
విజయరాఘవమేదినీవిభువరుండు.

103


వ.

మఱియు నీమహామహుండు.

104


సీ.

తడలేవి నిత్యసత్రము బెట్ట క్షామంబు
        కాంతల మధ్యభాగంబుఁ జేరెఁ
జల్లఁగాఁ బాలింప జగతి తాపం బెల్ల
        నహితబృందంబుల నాశ్రయించె
బ్రజల నిజాచార[2]పదవి వర్తిలఁ జేయ
        దండంబు లాతపత్రముల నిల్చె
జగడంబులను గెల్వ శాత్రవాళిమదంబు
        భద్రేభములయందుఁ బాదుకొనియె


తే.

గాని యొండెడ నిజపదం బూనదయ్యె
మహితనిజభక్తి కలరుచు మన్ననారు
చెంగమలవల్లియును దాను జెలఁగ వీట
ధాత్రి వర్ధిల్లు మన్నారుదాసుఁ డితఁడు.

105


వ.

అష్టైశ్వర్యసంపన్నుండై యిప్టోపభోగంబు లనుభవింపుచుఁ బారంపర్యంబు
గా సంపదలు గలిగించు చంపకవననేతకు మహోత్సవపరంపరలు వెలయింపు
తలంపున నుండు నయ్యవసరంబున.

106


క.

మనసిజకోటివిలాసా!
కనకవనీనిత్యవాస! కాంచనవాసా!

  1. నిల్చుచుండు
  2. పదవర్తిలఁజేయ