పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19

చాతుర్వర్ణ్యవర్ణన

ఉ.

అంబుజసంభవుండు వినుఁ డాదియుగంబున యత్న మొప్ప య
జ్ఞం బొక టాచరించి యల శౌరినిఁ దన్పుట యేమి చిత్ర మం
చుం బురిలోని బ్రాహ్మణులు జూడఁ బ్రదక్షిణరీతి మీర య
జ్ఞంబులు [1]సేయుచున్ దినము శౌరికి మోద మొనర్తు రెంతయున్.

93


ఆ.

అప్పురంబునందు నతివిచిత్రం బిది
క్రతువులందు ద్రవ్యరాసు లొసఁగి
యుత్తరాయణంబు నొగి దక్షిణాయనం
బుగ నొనర్తు రరయ భూమిసురలు.

94


క.

[2]శ్రీ గలిగి చదువుసాముల
భోగంబుల త్యాగములను భుజశౌర్యములన్
బాగగు రాజకుమారకు
లేగతి నల పరశురాము నెంచరు వీటన్.

95


క.

నూటికి నొక్కొక్కటిగా
మాటికి నభివృద్ధి గను సమగ్రధనములన్
గోటికిని పడగ లెత్తిన
మేటి కిరాటవ్రజంబు మించు న్వీటన్.

96


క.

బలియును మున్నొక రెండడు
గుల నేల నొసంగలేక [3]కొదవపడె నెటం
చల పురి శూద్రులు శౌరికి
వలసిన గ్రామంబు లొసఁగి వరలుదు రెపుడున్.

97


గజతురగపదాతివర్ణన

చ.

ధరఁ దమవంశమందు నొకదంతిపతిం దగఁ గాచినట్టి శ్రీ
హరిపద మౌ గదా యిది యటంచు ఘనంబున నెంచి యేమొ య
ప్పురిఁ జరియించు మత్తగజముల్ ప్రజ లెల్లను మెచ్చి చూడఁగాఁ
గరములు సాంచి యాకసముఁ గౌతుక మొప్పఁగ నంటు సారెకున్.

98
  1. సేయుచుండినను
  2. శ్రీ గలిగి సదువుసాలముల
  3. కొదవపడ నెటం