పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

మన్నారుదాసవిలాసము


తే.

పార్థసారథి చక్రి మాపాలివేల్పు
పద్మనేత్రుండు శౌరి మాపాలివేల్పు
భవ్య దాయి మురారి మాపాలివేల్పు
భక్తనిధి మన్ననారు మాపాలి వేల్పు.

114


వ.

అని మన్ననారుల సన్నుతించి యామన్నారుదాసభూపాలుండు సన్నిధివా
రొసంగు తీర్థప్రసాదంబులు స్వీకరింపుచు శ్రీకరం బగు క్షేమకారిదర్శనంబు
గావింపుచు సంతసంబున నంతట.


సీ.

కరితురంగమశతాంగభటబృందంబులు
        తనముందు వెనుక సందడిగ నడవ
బంగారుటనుసుల పట్టుదిం డ్లమరించు
        పల్లకీలను సతుల్ పరఁగ రాఁగ
భేరీమృదంగాదిభీమవాద్యధ్వనుల్
        [1]దిక్కు లెల్లను నిండి పిక్కటిల్ల
నవరత్నమయకేతనప్రభావళి చేత
        నంబరం బతిచిత్ర మై చెలంగఁ


తే.

దరలి యత్తఱి నిజరాజధాని యైన
తంజపురినిఁ బ్రవేశించి తనర నచట
బహువిధాలంకృతులు గల్గి రహి జెలంగు
రాజవీథుల వచ్చుచో రాజముఖులు.

116


సీ.

ఈరాజకులచంద్రుఁడే కదా లోకంబుఁ
        జల్లఁగాఁ బాలించు సరసుఁ డనఁగ
నీమనోజ్ఞాకారుఁడే కదా యెంచఁగ
        మానినీమోహనమదనుఁ డనఁగ
నీకృపాగుణశాలియే కదా వసుమతీ
        పాలన శ్రీరామభద్రుఁ డనఁగ
నీశౌర్యసంపన్నుఁడే కదా కదనోగ్ర
        వీరారిభేదనవిజయుఁ డనఁగ


తే.

ననుచు సేసలు చల్లఁగ ననుచు వేడ్క
రమణులును దాను శుభముహూర్తంబునందు

  1. తెలుగులిపిలోని మూలగ్రంథములో నింతకుఁబైన లేదు. (M. 246.)