పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

121


విభవముల మించు నగరు ప్రవేశమగుచుఁ
జెలువ మన్నారు సేవించి చెలువుమీర.

117


సీ.

భాసిల్లు రాజగోపాలవిలాసంబు
        నందు సువర్ణసింహాసనమున
నాకాంతిమతిమొదలైన ప్రియాంగనల్
        కోరి యిర్వంకలఁ గొలువుసేయఁ
బొలుపొందఁ గొలువుండి పుత్రులు పౌత్రులు
        తామరతంపరై దండఁ దనర
నల శ్రీనివాసతాతాచార్య(వర్యులు)
        సరసప్రసంగముల్ సారె సేయ


తే.

సకలతారావృతుం డైన చంద్రుఁ డనఁగ
(విశదనిర్మల)చంద్రికల్ దిశల వెలయ
విజయరాఘవమేదినీవిభువరుండు
చెలఁగుచున్నాడు శోభనశ్రీలు వెలయ.

118


వ.

మఱియును.

119


సీ.

సమదమాయావాదతిమిరంబు లణఁగింప
        నుదయించు బాలసూర్యుం డనంగ
నతులితశ్రీవైష్ణవాంబోధులకు వృద్ధి
        సవరించు సితపక్షచంద్రుఁ డనఁగ
[1]అఖిలాధ్వగశ్రేణి కనివార్యఫలములు
        ధర నిచ్చు నవకల్పతరు వనంగ
సకలయాచకలోకచాతకసంఘంబు
        (కడుదృష్ణ నణఁచు మేఘం) బనంగ


తే.

బుధజనస్తుతసత్కళాభోజుఁ డనఁగ
మన్ననారు(ల సేవించి మనిన ఘనుఁడు)
వివిధవైభవములఁ జాలవినుతిఁ గాంచి
తనరుచున్నాఁడు మన్నారుదాసవిభుఁడు.

120
  1. అఖిలభ్యజశ్రేణి