పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

119


యాకాంతిమతి మున్నుఁగాఁగల యంగనలుం దానును జెంగమలాంబికా
రాజగోపాలకులసన్నిధి నిల్చి పెన్నిధిఁ గన్న చందంబున నానందింపుచు
నామన్ననారులకు నన్నివిధంబులం బూజలు గావించి యిట్లని స్తుతియించె.

111

విన్నపము

శ్రీ రాజగోపాల! త్రిభువనసుజనసంరక్షణలోల! సంక్రందనాదిసురబృంద
వందితచరణారవింద! [1]అడియని విన్నపము వడిగ వినుము; మహానుభావు
లైనయట్టి బ్రహ్మాదులు నీ మహిమఁ దెలియనేర రనిన నే మిమ్ము వినుతింప
నెంతటివాఁడను? మిమ్మే శరణుజొచ్చి నమ్మితి, సతతంబు [2]మీదివ్య
శ్రీకృత్పదంబుజములమీఁది భక్తి గలుగఁజేసి యాచరించి నన్ను రక్షింపవే
కరణారసమహిమ, సహజగుణసంపన్న! సంపంగిమన్న! (ఇదే సీస
పద్యమున్ను.)[3]

112


వ.

అని విన్నవించి మఱియు నిట్లని స్తుతించె.

113


సీ.

రక్షింతు నని ధాత్రి దక్షిణద్వారక
        భాసిల్లు వేల్పు మాపాలివేల్పు
చెంగమలమ్మతో శృంగారమహిమఁ గ
        న్పట్టిన వేల్పు మాపాలివేల్పు
రంగారు బంగారు చెంగోలుఁ గెంగేల
        గీలించు వేల్పు మాపాలివేల్పు
వెలఁదులు పదియాఱు వేలను బ్రేమచేఁ
        బాలించు వేల్పు మాపాలివేల్పు

  1. క. అడియేని
  2. మీదివ్యపదాంబుజముల. క. మీదుదివ్యశ్రీపాదాంబుజముల.
  3. సీ. శ్రీ రాజగోపాల! త్రిభువనసుజనసం
                రక్షణలోల! సంక్రందనాది
        సురబృందవందితచరణారవింద! య
                డియని విన్నపము వడిగా వినుము మ
        హానుభావు లైనయట్టి బ్రహ్మాదులు
                నీ మహిమఁ దెలియ నేర రనిన
        నే మిమ్ము వినుతింప నెంతటివాఁడను
                మిమ్మే శరణు జొచ్చి నమ్మితి సత
    తే. తంబు మీదివ్యశ్రీకృత్పదంబుజముల
        మీఁద భక్తి గలుగఁజేసి యాదరించి
        నన్ను రక్షింపవే! కరుణరసమహి
        మసహజగుణసంపన్న! సంపంగిమన్న!