పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

మన్నారుదాసవిలాసము


తే.

భర్త లాలించె నని హెచ్చి పలుకకమ్మ!
మగని మాటలకును మారుమలయకమ్మ!
ప్రాణనాయకు మతమె చేపట్టవమ్మ!
విభుఁడె దైవం బటంచు భావింపవమ్మ!

76


అప్పగింత

క.

అని యిటువలె బోధించిన
మనమున హర్షించి మిగుల మమతలు హెచ్చన్
వినయంబుమీర మ్రొక్కెను
తనతండ్రికిఁ గాంతిమతియుఁ దద్దయు భక్తిన్.

77


క.

మ్రొక్కిన పుత్రిక నప్పుడు
గ్రక్కున దీవించి మిగుల గౌరవ మొప్పన్
మక్కువ నాచార్యునకును
మ్రొక్కింపుచు నపుడు బలికె ముచ్చట మీరన్.

78


సీ.

ఆచార్య! నిను నమ్మి యాత్మజ నిచ్చితి
        బాల యేమెఱుఁగని గోల గనుక
[1]వేమారు మీతోడ విన్నవించెదను మీ
        ప్రియపుత్రుతోఁ దెల్పి ప్రేమమీర
సవతు లిందఱిలోనఁ జాల మన్ననమీర
        నాపట్టిఁ జేపట్టి [2]నడపు మనుము
బహుతపంబు లొనర్చి బాలను గన్న యా
        మమతఁ బల్కెదఁ బలుమారు నేను


తే.

మాకుఁ బనియేమి యిక తండ్రిమారు నీవు
మేల్మిమీరఁగ నడపిన మీకె ఘనత
యనుచు వినయోక్తులను బల్కి యానృపాలుఁ
డొప్పుమీరఁగఁ గన్నియ నొప్పగించె.

79
  1. వేమరుమాతోడ క. వేమరుమాతోడ
  2. నడపుమనుచు