పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

109


తే.

[1]ప్రబలు నైరావతము మించు భద్రకరులు
నఖిలలక్షణయుతజవనాశ్వములును
హేమగిరి నైనఁ దృణముగా నిచ్చునట్టి
యల్లునకు నిచ్చె నప్పుడు [2]హరుషమునను.

72


వ.

అనంతరంబ.

73


సీ.

వెలలేని తొడవులు వింతలౌ కోకలు
        రవికెలు పాపడల్ రంగుమీరు
రతనాల మంచముల్ రాణించు పఱపులు
        చెలువైన యొరగులు తలగడలును
బాగుమీరినయట్టి బంగారుబొమ్మలు
        పంచవన్నెచిలుకపంజరములు
కస్తూరివీణెలు గందంపుమానులు
        జవ్వాదిపిల్లులు జాలిపీఁట


తే.

చెలుల దాదుల మఱియు దాసీజనంబు
పరఁగఁగా నిచ్చి తనముద్దుపట్టి కపుడు
ఘనతచేఁ బదిలక్షల గ్రామములను
బసుపునకు నిచ్చి యెంతయుఁ బ్రాభవమున.

74


క.

అక్కా! దగ్గఱ రమ్మని
యక్కునఁ జేర్చుకొని చాల హర్షము మదిలో
నెక్కొనఁగ శిరసు మూర్కొని
చక్కని తనపట్టిఁ జూచి జనకుం డనియెన్.

75


సీ.

ప్రేమతో నినుఁ బిల్చి ప్రియుఁ డొసంగక నీవె
        వివరించి మున్పుగా వేఁడకమ్మ!
బహుమానముగఁ బిల్చి పతి నీకొసంగినఁ
        గొంచె మంచును నీవిఁ గొసరకమ్మ!
నెసరుతో రమణుండు నినుఁ బిల్వ నంపిన
        నేయెడలను జాగు సేయకమ్మ!
ప్రాణవల్లభుఁడు నిన్ రావింపకయమున్న
        బలిమి దగ్గఱబోయి నిలువుమమ్మ!

  1. ప్రజలు
  2. క. హర్షమునను