పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

మన్నారుదాసవిలాసము

పాన్పు

సీ.

విజయరాఘవమహీవిభుఁడు దా నప్పు డ
        య్యింతితోఁ గూడి పాన్పెక్కి వేడ్క
దంపతులకు నెల్లఁ దాంబూలఫలములు
        వరుసగా నొసఁగుచు వైభవమున
భాసురలీల సువాసినీజనులకు
        మూసి వాయనములు ముదిత యొసఁగ
బంగారుతొట్లఁ దా రంగుమీరఁగఁ బట్టి
        లాలి యూఁపుచు శుభలక్షణముగఁ


తే.

బగిదిఁ బెట్టించుకోవలె బాగుమీరఁ
బద్మలోచన! బాలునిఁ బట్టు మనియె
[1]బొక్కసము నించి వచ్చెద భూపవర్య!
బాలు నిటు బట్టు మనియెను భామ వేడ్క.

70


క.

ఆచార్యపురుషు లప్పుడు
నాచార్ తిరుమొళియు జదువ [2]నారికడంబున్
ధీచతురత దొల్లించిరి
ఆచార్యులు హెచ్చరింప నందము గాఁగన్.

71


రాజచంద్రుఁడు వధూవరులకు బహుమతుల నొసంగి, పుత్రికకు బుద్ధులు సెప్పుట

సీ.

రాజచంద్రవిభుఁడు రతనాలకడియముల్
        కడు నించు ముత్తెల కంఠసరులు
ఘన మైన చౌకట్లు కంఠమాలికయును
        వెలహెచ్చు చుఱుకు కెంపులతురాలు
పలకవజ్రంబుల బాగైన పదకంబు
        చెలు వైన పచ్చల చిలుకతాళి
పగడంపుపిడివంకి బలవైరివజ్ర మన్
        పేరు గల్గినయట్టి పెద్దకత్తి

  1. బొక్కిసము క. బొక్కసము
  2. నారికెడంబున్ క. నారికెడంబున్