పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

మన్నారుదాసవిలాసము


        నొఱపైన వజ్రాల యుత్తరిగెలు
పంచరత్నంబుల మించు బాహుపురులు
        తళుకైన రతనాల [1]తాయెతులును
రంగునీలంబుల రాణించు కడియముల్
        జీవరత్నంబుల చేసరాలు


తే.

తగిన వజ్రాలహంవీర [2]తాయెతులును
నొఱపుమీరిన కెంపుల యుంగరములు
బిరుదుపెండెంబు మొదలుగాఁ బేరుగలుగు
భూషణంబులు ధరియించెఁ బొలుపుమీర.

18


వ.

తదనంతరంబ.

19


క.

మంగళవాద్యంబులతో
బొంగుచు నుల్లభములోన భూసురవర్యుల్
రంగగు వివాహవేదిక
చెంగటికై రాణి దెచ్చి చెలు వమరంగన్.

20


సీ.

ఆవివాహపువేదియందు, నందంబుగ
        రాజితంబగు కల్పభూజ మునిచి
కనకవస్త్రంబుల గంధమాల్యముల నా
        భూసురవర్యులు పూజఁ జేసి,
హరిరాణితోడ బ్రహ్మాణి నింద్రాణినిఁ
        గొమరుమీరిన చిత్రకుంభములను
దగ నావరణదేవతలతోడఁ గూడంగ
        నావాహనముఁ జేసి యందముగను


తే.

బూజ గావించి యెంతయుఁ దేజ మమర
ద్వారమున వన్నెకోకలతోరణంబు
బాగుగ నమర్చి బంగరుపళ్లెరముల
నలు గమర్చిరి మిక్కిలి నవ్యముగను.

21


వ.

అంతట మఱియును.

22
  1. తాయతలును, క. తాయతులును
  2. తాయెతలును, క. తాయతులును