పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

95


చలువను మించిన జిలుగుదుప్పటిచేతఁ
        దడియొత్తె నప్పుడు పడఁతి యొకతె


తే.

వనిత యొక్కతె కురుల జవ్వాది యుంచెఁ
దొయ్యలి యొకర్తు సామ్రాణిధూప మొసఁగెఁ
దరుణి యొక్కర్తు నిలువుటద్దంబు పూనఁ
జెలువ యొక్కతె సొగసుగ సిగ యమర్చె.

13


వ.

ఇవ్విధంబున మంగళస్నానవైభవం బాచరించిన యాచెంగమలాంబికావర
కుమారుండు.

14


సీ.

రతనాలజంటిచే రహిమీరఁ గనుబట్ట
        బురుసారుమాల్ గట్టెఁ బొంక మమర
నొరపైన సిగమీఁద హొయిలుగాఁ గన్పించ
        హెచ్చైన ముత్యాలకుచ్చుఁ దాల్చె
మంజాడులను మించు మగరాలనిగరాల
        రంజిల్లునట్టి తురాయి బూనె
ముద్దునెమ్మోమున మురువుగాఁ గనుపించఁ
        దెలిముత్తియముల ముర్వులు ధరించెఁ


తే.

జెక్కుటద్దంబులందును జిగి చెలంగ
వీనులను గొప్ప చౌకట్లు వెట్టె వెలయఁ
జుఱుకు కెంపుదామకముల సొంపుమీరఁ
గంఠమున నుంచె వజ్రాలకంఠసరులు.

15


వ.

మఱియును.

16


క.

[1]బురుసాయిజారుమీఁదను
హరు వగు ముత్యాలజంటి నరచట్టపయిన్
[2]2మెఱుఁగైన రాజదుప్పటి
నెరయఁగ వజ్రాలవంకి నీటుగఁ దాల్చెన్.

17


సీ.

ఘనమైన నక్షత్రకంఠమాలికయును
        జెలువైన పచ్చలచిలుకతాళి
యింపుగా విలసిల్లు కెంపులపదకంబు

  1. బురుసాహిజారుమీఁదను
  2. మెరుఁగగు విరాజిదుప్పటి. క. మెరుఁగను విరాజిదుప్పటి.