పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

మన్నారుదాసవిలాసము


తే.

ప్రియముతోడుత నేఁ బూని పెండ్లి సేయ
సవతులందును నీ పుత్రి సాటి యెవ్వ
రింక నాలోచనలు మాని యిపుడు సుతను
విజయరాఘవునకు నిమ్ము వేడ్క మీర.

51


వ.

అని పల్కిన.

52


సీ.

ఆమాట లాలించి యారాజు ముదముతో
        నాచార్యవర్యున కనియె మగుడ
ననఘాత్మ! యిట్లు మీ రానతి యిచ్చిన
        నే నుత్తరంబియ్య నెంతవాఁడ?
స్వామివారు తనకు సకలసౌభాగ్యంబు
        లేవేళ సమకూర్చ హితుల రగుట
నాముద్దుపట్టిని నరనాయకులు మెచ్చ
        విజయరాఘవునకు వేడ్క నిత్తుఁ


తే.

బొంతనంబులుఁ దెలిసి మా కాంతిమతికి
మంచిలగ్నంబుఁ దగ నిశ్చయించి యిపుడు
పెండ్లి పెద్దలు మీర యై ప్రేమఁ బూని
పెండ్లి సేయుఁడు వేగమే పృథివి వెలయ.

53


వ.

అనిన నా రాజచంద్రునకు నాయాచార్యశిఖామణి యిట్లనియె.

54


తే.

మన్ననారురథోత్సవమహిమ రేపు
వేడ్కఁ గావించి యెంతయు విభవ మలర
వినుము నిశ్చయతాంబూల మొనర సేయ
నీదునగరికి వత్తుము నిక్కముగను.

55


శ్రీనివాసతాతయాచార్యులు వివాహమంగళవార్తను మన్నారుదాసున కెఱింగించుట; మన్నారుదాసుఁడును మన్ననారు సేవించి యానందించుట

వ.

అని యాసలిచ్చిన యాచార్యచంద్రునకు రాజచంద్రుండు నమూల్యంబు
లగు కనకాంబరంబులు ననర్ఘంబు లగు మణిభూషణంబులు సారఘనసార
తాంబూలంబు లర్పించినఁ గైకొని [1]యమ్మహామహుండు నిండువేడుక
తోడ మరలివచ్చి చెన్నుమీరు మన్నారుదాసునినగరు బ్రవేశించి యంతః
పురంబుఁ జేరవచ్చె నాసమయంబున.

56
  1. యిమ్మహామహుండు