పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

85


తే.

బరఁగఁ గులగుణరూపసంపదలు బొగడ
నౌర! రఘునాథసుతుఁడు నీయల్లుఁ డగుట
కలర మాతోడ నీకు వియ్యంబు నంద
నెంత భాగ్యంబు సేసితి! విలను నీవు.

48


క.

అనిన విని రాజచంద్రుఁడు
మనసున యోజించి మిగుల మమతలు [1]హెచ్చన్
ఘను లగు తాతాచార్యులు
గనుఁగొని యిట్లనుచుఁ బలికె గౌరవ మొప్పన్.

49


సీ.

బహువర్షములు బూని బాగుగాఁ దపముల
        నొనరించ నీకూతు రుదయ మయ్యె
విజయరాఘవునకు [2]వెయ్యారు లింతులు
        కలిగియుండఁగ నెట్లు కన్య నిత్తు
సవతులలోన నీ చను దాగు పసిబిడ్డ
        యేగతి మెలఁగుఁ దా నింపుమీర?
మన్నెరాయఁ డైన మన్నారుదాసుని
        చిత్త మెఱఁగి యెట్లు సేవ సేయుఁ?


తే.

బృథివి దొర లెల్ల నూతనప్రియులు గారె?
ప్రేమ దనరంగ నాపుత్రిఁ బెండ్లిసేసి
యల్లు నిల్లట ముంచంగ నాత్మలోనఁ
దలఁచియుండుదు నేను శ్రీతాతయార్య!

50


సీ.

అన విని యాచార్యుఁ డారాజుఁ గనుఁగొని
        పలికె నిట్లనుచును భావ మలగఁ
గామిను లెందఱు కలిగిన నందఱి
        సమముగా నేలెడు స్వామి యతఁడు
పసిబిడ్డ యైనను భావంబు రంజిల్ల
        దిద్దుకోనేర్చిన ధీరుఁ డతఁడు
చన విచ్చి నడపెనా శాశ్వతంబుగ నిల్పు
        నితరరాజులసాటి యెంచ నేల?

  1. హెచ్చెన్
  2. వెయ్యారు యింతులు