పుట:మధుర గీతికలు.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చి ట్టి పా పఁ డ :


చిట్టిపాపఁడ ఎందుండి యుట్టిపడితి ?'
వవతరించితి దివినుండి యవనితలము •
ముద్దునెమ్మొగ మెందుండి పుణికికొంటి ?'
పూర్ణ చంద్రునిలోనుండి పుణికికొంటి.`

జిలుగుముంగురు లెందుండి చిదుముకొంటి *
చిమ్మచీఁకటిలోనుండి చిదుముకొంటి?'
మొలకనవ్వుల నెందుండి గిలుబుకొంటి ?'
తళుకువెన్నెలలోనుండి గిలుబుకొంటి. '

సొగసుకన్నుల నెందుఁడి చూఱగొంటి ?'
చుక్క గుంపులలోనుండి చూఱగొంటి.
చుఱుకుచూపుల నెందుండి చెరివికొంటి ?'
మెఱపుతీవలలో నుండి చెరివికొంటి”