పుట:మధుర గీతికలు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జలకమాడించి, జిలుఁగుదువ్వలువ లొసఁగి.
తిలకమును దీర్చి, చెలువుగా తలను దువ్వి,
బువ్వ దినిపించి ని న్నెప్డు బ్రోచుచుండు
తల్లి ఋణమును దీర్ప నీతరమె వత్స ?

చెడుగుబుడుతలతో నీవు చెలిమిచేయ
మంచిమాటలచే నిన్ను మందలించి
బుద్ధులను చెప్పి మెల్లన బుజ్జగించు
తల్లి ఋణమును దీర్ప నీతరమె వత్స?

5