పుట:మధుర గీతికలు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



కొమరుపెదవుల నెందుండి గుంజికొంటి? '
సంజకెంపులలో నుండి గుంజికొంటి.'
పల్లువరుసల నెందుండి కొల్లగొంటి '?
మొల్ల మొగ్గలలోనుండి కొల్ల గొంటి.”

గొనబుపలుకుల నెందుండి కూర్చుకొంటి '?
కొదమ చిలుకలలో నుండి కూర్చుకొంటి.'
బెళుకుచెక్కుల నెందుండి మలఁచుకొంటి ?'
నిలువుటద్దములోనుండి మలఁచుకొంటి .'

చిన్నినాసిక యెందుండి చిమ్ముకొంటి ?'
కమ్మసంపఁగిలోనుండి చిమ్ముకొంటి. '
బుచ్చిగడ్డము నెందుండి పుచ్చుకొంటి?'
పువ్వుతొడిమలలో నుండి పుచ్చుకొంటి .'

పొలుపుపొక్కిలి యెందుండి పొదివికొంటి?'
పొన్నపువ్వులలోనుండి పొదివికొంటి.'
కులుకునడకల నెందుండి కొసరుకొంటి ?'
గున్నయేనుఁగులోనుండి కొసరుకొంటి.'