పుట:మధుర గీతికలు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



చిఱుతచేతుల నెందుండి తుఱిమికొంటి?'
తొగలతూఁడులలోనుండి తుఱిమికొంటి.'
చిట్టిపాపఁడః నీమేని కెట్టు గలిగె
ఇట్టి జిగి, యిట్టి నిగనిగ, యిట్టి వలపు: '

తఱపి మెఱపులలోనుండి తళతళయును,
మంచుబిందులలోనుండి మార్దవంబు.
పడనుపుప్పొడిలోనుండి పరిమళంబు
తివిచి నామేని చెలువంబు దిద్దికొంటి.'

8