పుట:మధుర గీతికలు.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నతో నాడుకొందు



కొదమకోయిల కో యని కూయుచోట
గుమ్మగు మ్మని నెత్తావి గుబులుచోట
పొంగి నెలయేఱు జలజల పొరలుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

మలయపవనుండు మెలమెల్ల మలయుచోట
అళులు జుమ్మని గానమ్ము సలుపుచోట
పసరుపచ్చికజొంపమ్ము లెసఁగుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

అల్లి బిల్లిగ పూఁదీగ అల్లుచోట
నెమలి పురి విచ్చి నృత్యంబు నెఱపుచోట
గఱికితుద మంచుబిందులు మెఱయుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు

9